
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైయున్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో తాజాగా ఓ రాజకీయ పోస్టర్ కలకలం రేపిన విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అయితే ఆ పోస్టర్ను చూసిన భక్తులు ఆగ్రహంతో టీటీడీపై మండిపడ్డారు. తమిళనాడుకు చెందినటువంటి కొంతమంది అన్న డీఎంకే కార్యకర్తలు ఆలయ పరిసరాల్లో దివంగత సీఎం జయలలిత మరియు పలణి స్వామి ఫోటోలతో కలిపి ఉన్నటువంటి పోస్టర్ ను పట్టుకొని తిరగడమే కాకుండా రీల్స్ కూడా చేశారు. ఈ రీల్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఆలయ పరిసరాలలో ఇలాంటి రాజకీయ చిహ్నాలు అలాగే ప్రచారాలపై నిషేధం ఉన్నప్పటికీ కూడా కొంతమంది కార్యకర్తలు అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించడం ఏంటని అగ్రహిస్తున్న సమయంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఈ విషయంపై స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్ ను ప్రదర్శించడమే కాకుండా రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా మేము గుర్తించామని.. సదరు వ్యక్తులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం కాస్త సద్దు మణిగింది.
Read also : Leave Story: లవర్‌తో గడపడానికి లీవ్ అడిగిన ఉద్యోగి.. మేనేజర్ ఏం చేశాడంటే..?
Read also : Crime: ఇంటి అద్దె అడిగినందుకు.. చంపి సూట్‌కేసులో పెట్టి..! (VIDEO)





