తెలంగాణ

బన్నీకి బెయిల్ ఇవ్వొద్దు అంటూ కోర్టును కోరిన పోలీసులు!

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : అల్లుఅర్జున్ కి పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. తాజాగా అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వద్దు అంటూ నాంపల్లి కోర్టును తెలంగాణ పోలీసులు కోరారు. పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళా చనిపోవడం తో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అరెస్టు అయిన మరుసటి రోజున తిరిగి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ విషయంపైనే తాజాగా పోలీసులు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

Read Also : ఇదేం ఫీల్డింగ్ రా బాబు!… బాక్సింగ్ డే టెస్టులో ఆసక్తికర సన్నివేశం?

అల్లు అర్జున్ బాగా డబ్బు ఉన్న వ్యక్తితో పాటుగా పలుకుబడి ఎక్కువగా ఉన్న వ్యక్తి కాబట్టి రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టుని కోరారు. దీని కారణంగా సాక్షులను అల్లు అర్జున్ ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలా చెప్తున్నామంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. మా కస్టడీలోనే పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణకు సరిగా సహకరించలేదు, మళ్లీ ఇప్పుడు బెయిల్ ఇస్తే మా విచారణకు అసలు సహకరించకపోవచ్చు అని తెలిపారు.

Also Read : నారాయణపురం ఎస్సీ హాస్టల్లో కలెక్టర్ నిద్ర

ఈ విషయంపై పోలీసులు ఇంకా దర్యాప్తులు కొనసాగిస్తూనే ఉన్నామని కోర్టుకు తెలిపారు. అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అల్లు అర్జున్కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. సినిమా భారీగా సక్సెస్ అయినా కూడా అల్లు అర్జున్ కు ఇలాంటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అల్లు అర్జున్ విషయంపై అసెంబ్లీలో కూడా చర్చలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

  1. ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
  2. కేటీఆర్ జైలుకైనా!హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్‌లో టెన్షన్
  3. ఎక్సైజ్ కానిస్టేబుల్ తో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాసలీలలు..!
  4. రాత్రికి ఫుల్లుగా తాగుతారా.. అయితే ఈ రూల్స్ చదువుకోండి.
  5. తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం.. రేపు రాత్రి ఉచిత రవాణా సదుపాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button