
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బందోబస్త్ కి వచ్చిన మహాముత్తారం ఎస్సై మహేందర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. వార్తను సేకరిస్తున్న తరుణంలో జర్నలిస్టు కెమెరాను నెట్టివేయడంతో పలువురు జర్నలిస్టులు అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో మీడియా మిత్రుని సహకారంతో తనపై వార్తలు వచ్చినంత మాత్రాన ఎవరు ఏమి చేయలేరు, పదిహేను సంవత్సరాల సీనియారిటీ ఇక్కడ అంటూ మాట్లాడడంపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రజల సమస్యలపై నిత్యం పోరాడే జర్నలిస్టుల పరిస్థితి ఇలా ఉంటే మరి సాధారణ ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అంటూ జర్నలిస్టులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపి ఎస్సై పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మహాదేవపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మిన్ను భాయ్ అన్నారు.
Read also : కల్యాణలక్ష్మి పేదింటికి వరం : వెదిరే విజేందర్ రెడ్డి
Read also : కడ్తాల్ మహాపిరమిడ్ లో ఘనంగా ప్రతీజీ ధ్యాన మహాయాగం





