
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ప్రస్తుత రోజుల్లో మూగజీవాల మరణాలు వివిధ రకాలుగా పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా మూగజీవాలకు విషం ఇచ్చి చంపడం వంటి వార్తలు మనం సోషల్ మీడియాలో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. అయితే తాజాగా మంత్రి సీతక్క కూడా ఈ విషయంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మూగజీవాలకు విషమిచ్చి చంపడం అనేది చాలా దారుణమని పేర్కొంటూనే… దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. పలుచోట్ల వీధి కుక్కలకు కావాలనే కొంతమంది విషమిచ్చి చంపుతున్నట్లుగా కొన్ని ఘటనలు తన దృష్టికి వచ్చాయి అని వెల్లడించారు. ఈ మూగజీవాల సమస్యలకు పరిష్కారం చట్టబద్ధంగా లేదా శాస్త్రీయంగా జరగాలి కానీ మీకు మీరే సొంత నిర్ణయాలు తీసుకోవడం సరికాదు అని అన్నారు. మరోవైపు కోతులను సైతం విషమిచ్చి చంపుతున్నారు అని.. ఈ ఘటనలో పలువురుపై కేసులు కూడా నమోదయ్యాయి అని వివరించారు. కాగా ఈ మధ్య RR లోని యాచారంలో 100 కుక్కలకు పైగా విషమిచ్చి చంపిన ఘటన వెలుగులోకి రాగా అది కాస్త వైరల్అయింది. మరోవైపు ఈ విషయంపై సినిమా నటులు సైతం స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also : నేటి నుంచి దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం
Read also : Income Tax: పెళ్లయిన జంటలకు గుడ్ న్యూస్, ఆదాయ పన్ను నుంచి ఉపశమనం!





