
PM Modi Speaks With Zelensky: ఉక్రెయిన్ లో శాంతి స్థాపన జరగాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలన్ స్కీతో ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతియుత పరిష్కారానికి భారత్ తన వంతు కృషి చేస్తుందన్నారు. భారత్ అందిస్తున్న సహకారం కొనసాగుతోందని ప్రధాని మోడీ తెలిపారు. జెలన్ స్కీతో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంపైనా మాట్లాడినట్లు తెలిపారు. పరస్పర ప్రయోజనాల సహకారం పెంపు గురించి చర్చించారు. భవిష్యత్తులో సైతం సంప్రదింపులు కొనసాగించాలని వీరిద్దరు నిర్ణయించారు.
రష్యా దాడుల గురించి వివరించిన జెలన్ స్కీ
ఉక్రెయిన్ లక్ష్యంగా రష్యా జరుపుతున్న దాడుల గురించి ప్రధాని మోడీకి ఆ దేశాధ్యక్షుడు వివరించారు. జాపోరిజ్జియా బస్టాండ్ పై రష్యా బీకర బాంబుల దాడికి తెగ బడిందన్నారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య శాంతి కోసం దౌత్యపరమైన అవకాశాలు కొనసాగుతాయని చెప్పారు. కానీ, రష్యా దురాక్రమణతో పాటు అక్రమణలు కొనసాగుతోన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని ప్రధాని మోడీకి జెలెన్ స్కీ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ కు మద్దతు తెలపడం పట్ల ప్రధాని మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
త్వరలో జెలన్ స్కీ, మోడీ సమావేశం
అటు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో సాధారణ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యే క్రమంలో ఇరువురు వ్యక్తిగతంగా భేటీ కావాలని ప్రధాని మోడీ, జెలన్ స్కీ నిర్ణయించారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు ఉపయోగపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలు, శాంతిపై దిశగా కొనసాగనున్నట్లు వెల్లడించారు.
Read Also: పుతిన్ తో భేటీకి జెలెన్ స్కీ.. ట్రంప్ ప్రయత్నం!