- ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పార్లమెంటు అత్యున్నత పురస్కారం
- ‘స్పీకర్ ఆఫ్ ద కెనెసెట్ మెడల్’ను బహూకరించిన ఇజ్రాయెల్ పార్లమెంట్ స్పీకర్
- భారత్-ఇజ్రాయెల్‌ల మధ్య సంబంధాలను బలోపేతం చేసినందుకు గుర్తుగా పురస్కారం
- ఈ అవార్డు అందుకున్న తొలి ప్రపంచ నేతగా మోడీ గుర్తింపు!
ప్రధాని నరేంద్ర మోడీకి ఇజ్రాయెల్ పార్లమెంటు అత్యున్నత ‘స్పీకర్ ఆఫ్ ద కెనెసెట్ మెడల్’ను బహూకరించింది. భారత్-ఇజ్రాయెల్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు అసాధారణ రీతిలో కృషి చేసినందుకు దీనిని అందజేసింది. ఇజ్రాయెల్ పార్లమెంటు అయిన కెనెసెట్‌లో మోడీ ప్రసంగం పూర్తి కాగానే స్పీకర్ అమిర్ ఒహానా ఈ పురస్కారాన్ని బహూకరించారు.
ఈ అవార్డు అందుకున్న తొలి నేతగా మోడీ
‘స్పీకర్ ఆఫ్ ద కెనెసెట్ మెడల్’ను అందుకున్న తొలి నేత మోడీయే కావడం గమనార్హం. ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనా నుంచి కూడా అత్యున్నత పతకాలు అందుకున్న అరుదైన ప్రపంచనేత ఆయనే కావడం మరో విశేషం. ఆయన 2018లో పాలస్తీనా నుంచి ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ పురస్కారాన్ని స్వీకరించారు.

