
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ చాలా రసవత్తరంగా జరుగుతూ వస్తుంది. ఈ సీజన్ లో తక్కువ మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా కూడా ఎవరికి తెలియనటువంటి కొంతమంది న్యూ ప్లేయర్స్ అయితే చాలా అద్భుతంగా రాణించారు. నిన్నటితో లీగ్ స్టేజ్ ముగయగా… క్వాలిఫై అయినటువంటి టాప్ 8 జట్లు ఖరారయ్యాయి. అందులో భాగంగానే… పాయింట్ టేబుల్స్ లో టాప్ 8 జట్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
PKL-12 టాప్ 8 జట్లు :-
1. పూణేరి పల్టాన్
2. దబాంగ్ ఢిల్లీ
3. బెంగళూరు బుల్స్
4. తెలుగు టైటాన్స్
5. హర్యానా స్టీలర్స్
6. యూ ముంబా
7. పాట్నా పైరేట్స్
8. జైపూర్ పింక్ పాంథర్స్
8 జట్లు కూడా రేపటినుండి జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్ లలో తలపడనున్నాయి. మొదటగా రేపు హర్యానా స్టీలర్స్- జైపూర్ పింక్ పాంథర్స్, యూ ముంబా- పట్నా పోటీ పడనున్నాయి. ఇక ఈనెల 26వ తేదీన బెంగళూరు బుల్స్ తో మన తెలుగు టైటాన్స్ పోటీ పడనుంది. అయితే దాదాపు కొన్ని సంవత్సరాలు తరువాత తెలుగు టైటాన్స్ పాయింట్స్ టేబుల్ లో నాలుగో స్థానంలో నిలిచింది. మరి ఈసారైనా కప్పు కొట్టి చరిత్ర సృష్టిస్తుందా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.
Read also : డ్రాయర్ల కంపెనీ వెలగొట్టినోడివి.. డేటా సెంటర్లు తెచ్చావా : టీడీపీ ఎమ్మెల్యే
Read also : నేడు మరో అల్పపీడనం.. ఈదురు గాలులతో భారీ వర్షాలు





