
నారాయణపూర్, క్రైమ్ మిర్రర్:-
మానవత్వం ఉన్నవాళ్ళకి పదవి, పదవి ఉన్నవాళ్ళకు మానవత్వం ఉండాలని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలోనే అత్యధిక రెండవ మెజారిటీతో గెలిపించిన నారాయణపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన హాజరై, నూతనంగా ఎన్నికైన సర్పంచి ఉపసర్పంచి వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటుచేసిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. గెలిచిన ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. నారాయణపూర్ లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేయడానికి తనపూర్తి సహకారం ఉంటుందన్నారు. పాలకవర్గాన్ని ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన నారాయణపురం ప్రజలు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గం సభ్యులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Read also : యువకులను రౌడీలుగా మారుస్తున్నారు.. వైసీపీ పార్టీకి బాధ్యత అనేది లేదు : హోం మంత్రి అనిత
Read also : సర్పంచ్ పాలకూరి రమాదేవి,నరసింహగౌడ్ లను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి





