
మునుగోడు, క్రైమ్ మిర్రర్ :- సర్పంచ్ ఎన్నికలలో మునుగోడు గ్రామ పంచాయతీ ప్రజలు మార్పు కోరుకున్నారు. కొంతమంది నాయకులు ఆ అభ్యర్థిపై ఎన్నో దుష్ప్రచారాలు చేసిన ప్రజలంతా అభివృద్ధికి ముందడుగు వేసి మేము అంతా అక్కవైపే అన్నారు. పదవి లేకముందే గ్రామ అభివృద్ధికి తనవంతుగా సహకరించిన పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ ను మెజారిటీతో గెలిపించుకున్నారు మునుగోడు ప్రజలు. మొదట కొంత ఉత్కంఠ వున్న కానీ.. వరుసగా క్లిన్ కొట్టారు. మునుగోడులో బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మార్పు కోరుకొని అభివృద్ధికి పట్టం కట్టిన మునుగోడు ప్రజలకు రుణపడి పనిచేస్తా అని,గ్రామ అభివృద్దే ప్రధాన లక్ష్యంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని అన్నారు. ఎన్నికలో విజయం పొందడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
Reas also : Modi-Putin Selfie: మోడీ-పుతిన్ సెల్ఫీ.. ట్రంప్ పై అమెరికన్ల విమర్శలు!
Read also : Hanuman Marriage Story: పెళ్లయిన సరే.. ఆంజనేయుడిని బ్రహ్మచారి అని ఎందుకు పిలుస్తారో తెలుసా?





