Tuesday, February 17, 2026
Homeతెలంగాణవైద్య సేవ‌ల‌ను ప్రజలు వినియోగించుకోవాలి

వైద్య సేవ‌ల‌ను ప్రజలు వినియోగించుకోవాలి

  • జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, క్రైమ్ మిర్ర‌ర్: ప్ర‌భుత్వ ఆసుప‌త్రిల్లో అందించే ఉచిత వైద్య చికిత్స‌లు, వైద్య‌ సేవ‌ల‌ను ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కోయ శ్రీ‌హ‌ర్ష అన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలో ఉన్న జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్నిఆక‌స్మిఖంగా త‌నిఖీ చేశారు.

రూ. 24 లక్షల రూపాయలతో కంటి శస్త్ర చికిత్స విభాగంలో నూతనం గా కొనుగోలు చేసిన ఫాకో యంత్రం పని తీరు వివరాల పై కలెక్టర్ ఆరా తీశారు. కంటి శస్త్ర చికిత్సలను అత్యాధునిక పద్ధతుల్లో వినియోగించే ఈ ఫాకో యంత్రం పెద్దపెల్లి జిల్లాలోనే ప్రథమంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అ వసరమైన ప్రజలు దీనిని పూర్తి స్థాయిలో వినియోగిం చుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, కంటి శస్త్ర చికిత్స నిపుణులు సబిహా, సంబంధి త అధికారులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments