
కోదాడ,క్రైమ్ మిర్రర్ :- మెంథా తుఫాన్ ప్రభావం వల్ల ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోదాడ పరిధిలోని అధికారులు, అన్ని శాఖల అధికారులు గ్రామాలలో పట్టణాలలో ప్రజలు అందుబాటులో ఉండి సమన్వయంతో పనిచేసి ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు కోదాడ టౌన్ సిఐ కె శివ శంకర్. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న వాగులు వంకలు, కాలువలు, చెరువులు కుంటలు వద్దకు ఎవరూ కూడా వెళ్లవద్దన్నారు. శిధిలమైన భవనాలలో ఉండవద్దన్నారు. విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు, స్తంభాలను తాకవద్దని ప్రజలకు రైతులకు సూచించారు. అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటికి రావాలని కోదాడ టౌన్ సిఐ కె శివ శంకర్ ప్రజలను కోరారు.
Read also : మెంథా తుఫాన్ ప్రభావం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి..!
Read also : యూఏఈలో తెలుగోడికి రూ.240 కోట్ల లాటరీ





