
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- సాధారణంగా రాజకీయ పార్టీల నాయకుల కోసం కొంతమంది అభిమానులు ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరు. కొంతమంది అయితే పార్టీకి అభిమానులుగానే కాకుండా భక్తులుగా కూడా ఉంటారు. పార్టీ అంటే ఎంతో ఇష్టంగా భావించే కొంతమంది వాళ్ళు చేసే పనుల ద్వారానే ఆ ఇష్టం ఎంత ఉందనేది స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ అంటే నిమ్మల రామానాయుడుకు ఎంత ఇష్టమో అర్థమయ్యేలా మరోసారి ఏపీ ప్రజలకు తెలిసేలా చేశారు. తెలుగుదేశం పార్టీకి కరుడు కట్టిన అభిమానులు ఒక ఎత్తు అయితే.. నాయకుడు రామానాయుడు మరో ఎత్తు. వరుసగా మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి… నేడు జల వనరుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయినా కానీ ఎటువంటి ఆడంబరాలు చేయడం లేదు.
Read also : ఏపీకి వాయుగుండం ముప్పు.. ఈ జిల్లాలపై ప్రభావం!
తాజాగా నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. వివాహానికి సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కుటుంబ సమేతంగా హాజరయ్యి వధూవరులను దీవించారు. ఎంతోమంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సాధారణంగా సర్పంచ్, జడ్పిటిసి లేదా ఎంపీటీసీ అలాగే ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఫంక్షన్ అంటే చాలా ఆడంబరంగా, బ్రాండెడ్ దుస్తులు వేసుకొని స్టైలిష్ గా కనపడాలని అనుకుంటారు. కానీ నిమ్మల రామానాయుడు మాత్రం తన కుమార్తె వివాహ సందర్భంలో కూడా పార్టీ గుర్తు అయినటువంటి పసుపు రంగు బట్టలే ధరించి పార్టీపై తనకున్నటువంటి ఇష్టాన్ని మరోసారి రుజువు చేశారు. ప్రతిరోజు కూడా పసుపు బట్టలే ధరించి పార్టీ పథకాలను, ప్రజల అవసరాలను తీరుస్తూ ఉండే నిమ్మల రామానాయుడు.. తన కుమార్తె వివాహంలో కూడా అదే పసుపు బట్టలు ధరించి అందరిని కూడా ఆశ్చర్యపరిచారు. చాలామంది ఇలాంటి ఫంక్షన్ల సమయంలో కోటు ధరిస్తుంటారు.. లేదా వాళ్లకు నచ్చిన బట్టలను ధరిస్తారు. కానీ నిమ్మల రామానాయుడు మాత్రం పసుపు రంగు కంటే గొప్పది ఏముంటుంది అని భావించారేమో కానీ.. అవే బట్టలు ధరిస్తున్నారు. టీడీపీ పార్టీలో ఇంతటి నిబద్ధత కలిగిన నాయకుడు ఉండడం చాలా గ్రేట్ అని రామానాయుడు నియోజకవర్గం ప్రజలు అందరూ తెగ పోగొడుతున్నారు.
Read also : పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్!