జాతీయంవైరల్

” కల్తీ ” అనే పదంతో గజ గజ వణికిపోతున్న ప్రజలు..!

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- మన భారతదేశంలో ప్రస్తుతం “కల్తీ” అనే పదం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. కల్తీ అనే పేరు వింటేనే వెంటనే భయపడిపోతున్నారు. దేశంలో ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు నకిలీనా లేదా నిజమేనా అని ఆలోచించే పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలో కల్తీకి కొరతేది అని అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరూ ఉపయోగించే పాలు, మెడిసిన్, మద్యం అలాగే నిత్యవసరాలు అన్నీ కూడా కల్తీ అవ్వడం సోషల్ మీడియా వేదికగా ఎన్నో సందర్భాల్లో చూసాం. రాజకీయ నాయకులే మద్యం గురించి కల్తీ జరుగుతుందని ఎన్నోసార్లు ప్రస్తావించారు.

Read also : ఫేక్ న్యూస్ సృష్టించడం ఇండియా స్పెషాలిటీ : బంగ్లాదేశ్ చీఫ్

అవన్నీ ఒక ఎత్తు అయితే… తాజాగా మనం వాడే టూత్ పేస్ట్ ‘Colgate’ లో కూడా కల్తీ రసాయనాలు కలుపుతున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. అవే కాకుండా పన్నీర్, ఈనో, సెన్సోడిన్ వంటివి కూడా పూర్తిగా కల్తీవి తయారు చేస్తున్నారని స్పష్టంగా వార్తలు ద్వారా అర్థమవుతుంది. ఇలా ఎన్నో రసాయనాలు, నాసిరకం పదార్థాలతో తయారైనటువంటి వాటిని మనం తినడం వల్ల మన ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం బయట ఏ వస్తువు తీసుకుంటున్న కూడా ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. దీనికి కారణం కల్తీ భయం. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా కల్తీ భయము ప్రస్తుతం నెలకొంది. వెంటనే ప్రభుత్వ అధికారులు, ఆయా కంపెనీలకు సంబంధించిన ఓనర్లు వీటి పట్ల కాస్త శ్రద్ధ వహించాలని… లేదంటే అమాయకుల ప్రాణాలు బలైపోవడం ఖచ్చితం అని ప్రజలు కూడా డిమాండ్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జరిగినటువంటి కల్తీ కారణంగా కొన్ని వందల మంది మృతి చెందారు. దేశంలో కల్తీ ఘటనలు ఎక్కువ అవ్వడంతో అధికారులు కూడా వీటిపై దృష్టి పెడుతున్నారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వస్తువులను అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు.

కాంగ్రెస్ ను ఓడించి తీరాలి… హిందీ సామెతలతో సభను మార్మోగించిన కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button