
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఎక్సైజ్ శాఖ సీరియస్ అయింది. ఎందుకంటే… తాజాగా ఎమ్మెల్యే రాజగోపాల్ మునుగోడులో వైన్స్ షాపులకు కొత్త రూల్స్ ప్రకటించారు. రాష్ట్ర మొత్తం ఎక్సైజ్ పాలసీ ఎలా ఉన్నా కూడా మునుగోడు లో మాత్రం తాను చెప్పినట్లు టెండర్లు దక్కించుకున్న వారు వ్యవహరించాలని ఇటీవల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటన చేశారు. స్థానికులు మాత్రమే వైన్ షాపులకు టెండర్లు వేయాలని కోరారు. అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9:00 వరకు మాత్రమే మద్యం అమ్మకాలు చేయాలని అన్నారు.
బెల్ట్ షాపులకు మధ్యాన్ని విక్రయిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఊరికి దూరంగా దుకాణాలు నడపాలి అని… చుట్టుపక్కల పరిమిట్ రూములను ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు. నాకు ఈ మునుగోడు ప్రజల ప్రాణాలు కంటే ఏవీ ముఖ్యం కావు అని.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోను అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రాణాల కన్నా పదవులు ముఖ్యం కావు అని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై రాజగోపాల్ రెడ్డి పై ఎక్సైజ్ శాఖ సీరియస్ అయ్యింది. మద్యం అమ్మకాలు అలాగే వైన్ షాప్ టెండర్లపై వివాదాస్పాదా వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. మేము ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Read also : సబ్సిడీపై రైతులకు వేరుశెనగ విత్తనాలు పంపిణీ!
Read also : వాళ్ళిద్దరు ఆడుతారని గ్యారంటీ అయితే ఇవ్వలేను : గౌతమ్ గంభీర్