
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ తేదీను ప్రకటించారు. ఈ సినిమా మార్చి 28వ తారీఖున గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని నిర్మాత ఏఎం రత్నం తెలిపారు. కాగా ఈ పనులు త్వరగా జరుగుతున్నాయని అన్నారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన మిగిలిన షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఇక ఈ చిత్రం నుంచి త్వరలోనే సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తామని అన్నారు. కదా ఈ చిత్రంలోని మొదటి రొమాంటిక్ సాంగ్ అనేది ఈనెల 24 వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఎన్నో నెలలుగా అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది.
కాగా 2024 వ సంవత్సరంలో ఎన్నికలలో జనసేన అధినేతగా ఉంటూ భారీ విజయన్నందుకొని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ప్రజలకు సేవలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఒకవైపు రాజకీయాల్లోనే ఉంటూ అప్పటి షెడ్యూల్సులలో అప్పుడప్పుడు సినిమాలలో డబ్బింగ్ చెబుతూ సినిమాలను పూర్తి చేస్తున్నాడు. కాగా ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే హరిహర వీరమల్లు సినిమా అయితే వచ్చేనెల థియేటర్లలో విడుదల కాబోతుంది. దీనిపై తాజాగా చిత్ర బృందం ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విపరీతమైన సంతోషంలో మునిగిపోతున్నారు.
ఫిరోజ్ గాంధీ నిజంగానే ముస్లిమా!… బండి సంజయ్ చెప్పింది నిజమా?.. అబద్దమా?