
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “OG” సినిమా రిలీజ్ అవ్వడానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ సందర్భంగా నిన్న OG చిత్ర బృందం హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఒకవైపు వర్షం పడుతున్న కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG స్టైల్ లో మాట్లాడారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ పై కొంచెం ఆగ్రహించారు. ట్రైలర్ ఎక్కడ సుజిత్ అని పవన్ కళ్యాణ్ సుజిత్ ను పక్కకు పిలిచి మరి అడిగారు. వెంటనే సుజీత్ ఎడిటింగ్ ఇంకా పూర్తి కాలేదని అనడంతో పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ అయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ OG కటౌట్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి ఫాన్స్ ను అలరించారు. సేమ్ సినిమాలో నల్ల దుస్తులు ధరించినట్లుగా.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అచ్చం అలాంటి బట్టలు వేసుకు రావడంతో… రాజకీయం రాజకీయమే… సినిమా సినిమానే అని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక కామెంట్లు చేస్తున్నారు.
Read also : దసరా సెలవుల్లో ఊరెళ్తున్నారా… జరభద్రం : సీఐ చరమంద రాజు
సినిమాపై పవన్ కళ్యాణ్ కు ఉన్న పిచ్చి అలాంటిది అని… రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి సరిపోయింది.. లేదంటే ఈపాటికి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాకుండా ఒక్కొక్క సినిమాకు 1000 కోట్లు కలెక్షన్లు రాబట్టే వాడని ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన తర్వాత నుంచి సినిమాల్లో పూర్తిగా వదిలేస్తామని మాటిచ్చారు. OG, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఇక పూర్తిగా సినిమాలకు దూరమవుతానని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దీంతో ఫ్యాన్స్ ఒకంత ఇక పవన్ కళ్యాణ్ వింటేజ్ ను సినిమాలలో చూడలేము అని దిగులు చెందుతున్నారు.
Read also : DSC అభ్యర్థులు అలర్ట్.. 25వ తేదీన అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ!