తెలంగాణ

ఫార్మా రగడలో పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్.!

పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడిచేశారని పోలీస్ అధికారులు చెప్పారు. సురేష్ ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను లగచర్లకు రావాలని కోరాడు. ఈ ఘటనలో నరేందర్ రెడ్డి పాత్రే కీలకం ఈ దాడి ఘటనలో 47 మందిని గుర్తించామని,ఇంకా గుర్తించాల్సిన వారు ఉన్నారన్నారు. ఇప్పటివరకు 21 మందిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించడం జరిగిందని చెప్పారు.

  • ఈ ఘటన నరేందర్ రెడ్డి పాత్రే కీలకం..14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్
  • 19 మంది ఈఘటనలో భూమి లేని వారు పాల్గొన్నారు.
  • పరారీలో ఉన్న వారిని అతి త్వరలో పట్టుకుంటాం.!
  • నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు.!

క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి:- ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థులు దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దానిలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ ఫోన్లో మాట్లాడి దాడికి ప్రోత్సహించినట్టు బలమైన ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ కారణంగా నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం హైదరాబాదులో అరెస్టు చేసి అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు, అక్కడి నుంచి వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి, వికారాబాద్ నుంచి మళ్లీ పరిగి, అక్కడి నుంచి కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కొడంగల్ కోర్టులో హాజరు పరచారు. 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.

పక్కా ప్లాన్ ప్రకారమే దాడి :- పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడిచేశారని పోలీస్ అధికారులు చెప్పారు. సురేష్ ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను లగచర్లకు రావాలని కోరాడు. అభిప్రాయ సేకరణ కోసం ఘటన జరిగిన రోజున ఉదయం 11 గంటలకు అడిషనల్ కలెక్టర్ లింగయ్య, తాండూరు ఇంఛార్జ్ కలెక్టర్ ఉమాశంకర్, తహసీల్దారు కిషన్ నాయక్, విజయ్ కుమార్, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి లగచర్లకు వెళ్లారు. ఈ క్రమంలోనే రాళ్లు, కర్రలు, కారంపొడి ముందే సిద్ధం చేసుకుని, అధికారులు రాగానే దాడి చేయాలని సురేష్ ముందస్తు ప్లాన్ వేశాడు. ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు.అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించామని వెల్లడించారు.

నాన్ బెయిలబుల్ కేసులు:- ఇక పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం.. బూంరాస్పేట్ పోలీసు స్టేషన్లో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రైం నెంబర్ 153/2024 ప్రకారం.. కేసు సెక్షన్ 61(2), 191(4),132,109,121(1) 126(2)324 r/w190బన్స్ Sec 30Of pdpp యాక్ట్ , 128అఫ్ బన్స్ కింద కేసులు ఫైల్ అయ్యాయి.హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడంపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేసినట్లు వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొత్తం 47మందిని నిందితులుగా చేర్చామని, ఎఫ్ఐఆర్లో బోగమోని సురేష్ ప్రధాన నిందితుడు,మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి (ఏ1)గా పేర్కొన్నారు.

కుట్రలో భాగం ముందస్తు ప్రణాళికతో కలెక్టర్ అధికారులపై దాడి.!

మల్టీ జోన్ -2 ఐజిపి సత్యనారాయణ:- అన్ని ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు మల్టీ జోన్-2 ఐజిపి సత్యనారాయణ చెప్పారు. బుధవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి విచారణ అనంతరం మీడియాతో మల్టీ జోన్-2 ఐజిపి సత్యనారాయణ మాట్లాడారు.లగజర్ల ఘటనలో ఏ-1గా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిగా నిర్ధారణ చేశామన్నారు. ఈ ఘటనలో నరేందర్ రెడ్డి పాత్రే కీలకం అని అన్నారు. నరేందర్ రెడ్డిని జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు. రేపు కస్టడీపై కోర్టులో వాదనలు కొనసాగుతాయని తెలిపారు. ఈ దాడి ఘటనలో 47 మందిని గుర్తించామని,ఇంకా గుర్తించాల్సిన వారు ఉన్నారన్నారు. ఇప్పటివరకు 21 మందిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించడం జరిగిందని చెప్పారు. మిగతా వాళ్ల కోసం నాలుగు టీంలతో గాలిస్తున్నామన్నారు. ఈ ఘటనలో విట్టల్, దేవదాస్, గోపాల్ నాయక్, సురేష్, రాజు, విజయ్ ప్రధాన సూత్రధారులని వివరించారు. 42 మందిని పోలీస్ విచారణ చేసిన తర్వాత అందులో 19 మందికి భూమిలేదని భూమిలేని ఈ 19 మంది ఈ సంఘటనలో పాల్గొన్నారని తెలిపారు.కుట్రలో భాగంగా ముందస్తు ప్రణాళికతోనే కలెక్టర్, అధికారులపై దాడి చేశారని అన్నారు. పరారీ లో ఉన్న వారిని అతి త్వరలో పట్టుకుంటామని, దేవదాస్, సురేష్ ఈ దాడిలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. అధికారులపై దాడి ఘటనలో ఎంతటి వారు ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదని మరో మారు ఐజిపి సత్యనారాయణ తేల్చి చెప్పారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button