
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న ఐదవ టి20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ ఐదవ టి20 లో భారత్ విజయం సాధించడంతో ఈ టి20 సిరీస్ కూడా కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడానికి స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ కారణం. కేవలం 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్షు లతో ఏకంగా 63 పరుగులు చేశారు. అతను గ్రీసులోకి వచ్చిన మొదటి బంతికే సిక్స్ కొట్టడంతో స్టేడియంలో ఉన్నటువంటి తన గర్ల్ ఫ్రెండ్ మహిక శర్మ ఫ్లైయింగ్ కిస్ లతో రెచ్చిపోయారు. అతి తక్కువ బంతుల్లోనే హార్థిక్ పాండ్యా విరుచుకుపడడంతో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నంతసేపు కూడా తన గర్ల్ ఫ్రెండ్ మహిక శర్మ ఫుల్ జోష్ లో ఉండిపోయింది. అతను ఆడుతున్నంత సేపు కూడా చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తూ రచ్చ రచ్చ చేస్తూనే అతనికి సపోర్ట్ గా నిలిచింది. దీంతో ఈ మ్యాచ్ కు ఇవే హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది
Read also : OM Birla Tea Party: స్పీకర్ టీ పార్టీ.. మోడీ, రాజ్‌నాథ్ తో ప్రియాంక ముచ్చట్లు!
Read also : Tamil Nadu SIR: తమిళనాడు సర్.. ఏకంగా 97,00,000 ఓట్ల తొలగింపు!





