తెలంగాణ

పాములపహాడ్ గ్రామా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్...!

గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బీఆర్ఎస్ చేరిక

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి: పాములపహాడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు తోట సత్తిరెడ్డి ఆ పార్టికి రాజీనామా చేసి మాజీ  ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు .. ఈ సందర్బంగా బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు..

Also Read:హ్యాక్‌కు గురైన రాచకొండ, సైబరాబాద్ పోలీస్ వెబ్‌సైట్లు..!

బుదవారం మిర్యాలగూడ టౌన్ రెడ్డి కాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు మాడ్గులపల్లి మండలం పాములపహాడ్ గ్రామ  కాంగ్రెస్ పార్టీ మాజీ  అధ్యక్షులు తోట సత్తిరెడ్డి కాంగ్రెస్ పార్టికి రాజీనామా చేసి పాములపహాడ్ గ్రామం మాజీ సర్పంచ్ యాతం లక్ష్మి నరేందర్ రెడ్డి, ప్రసేంట్ గ్రామం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్ది చింతకాయల  సైదులు  అధ్వర్యంలో .. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  సమక్షంలో బీఆర్ఎస్ పార్టిలో చేరారు..

బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులు ..
బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులు ..
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….ఈ నెల  14 వ తారీఖు నాడు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో బారాస బలపరచిన అభ్యర్ధి చింతకాయల సైదులు గెలుపుకై 100 మంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఈ రోజు పార్టిలో రావటం నిజంగా శుభపరిణామం , 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసిఆర్  అధ్వర్యంలో గ్రామాలు సంపూర్ణ అభివృద్ది సాధించాయని అదేవిధముగా కేసిఆర్ హయాంలో ప్రభుత్వ ఫలాలు అందిపుచ్చుకున్న వారే బారాస బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధిని గెలిపిస్తారని చెప్పారు..
బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న పాములపహాడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు తోట సత్తిరెడ్డి ..
బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న పాములపహాడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు తోట సత్తిరెడ్డి ..

Also Read:Love Marriage: అత్తను పెళ్లి చేసుకున్న యువకుడు!

కార్యక్రమములో మండల పార్టీ అద్యక్షులు పాలుట్ల బాబయ్య, మాజీ పిఏసిఎస్ (PACS)  చైర్మన్ జేరిపోతుల రాములు గౌడ్, మాజీ సర్పంచ్ లు యాతం లక్ష్మి నరేందర్ రెడ్డి, దొమ్మటి సైదులు, సోషల్ మీడియా  ఇంచార్గి అలుగునూరి ఈదయ్య, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధి చింతకాయల సైదులు, గ్రామం యూత్ బీఆర్ఎస్ అద్యక్షులు వేముల సందీప్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button