Sunday, March 1, 2026
Homeక్రీడలుT20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్, శ్రీలంకతో మ్యాచ్...

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్, శ్రీలంకతో మ్యాచ్ లో గెలిచినా నో యూజ్!

  • టీ20 వరల్డ్‌ కప్‌లో ముగిసిన పాకిస్థాన్‌

  • 5 పరుగులతో శ్రీలంకపై పాక్‌ గెలుపు

  • అయినా, సిరీస్ నుంచి ఔట్

  • సెమీస్‌ కు చేరిన న్యూజిలాండ్‌

టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ కథ ముగిసింది. సూపర్‌-8లో భాగంగా గ్రూప్‌-2లో జరిగిన కీలక మ్యాచ్‌లో పాక్‌ 5 పరుగులతో శ్రీలంకపై గెలిచింది. పాక్‌ నాకౌట్‌ చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపుతోపాటు కివీస్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ సాధించాలి. ఈ క్రమంలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 20 ఓవర్లలో 212/8 స్కోరు చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ సాహిబ్జాదా ఫర్హాన్‌ (60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌ లతో 100) సెంచరీ చేయగా.. ఫఖర్‌ జమాన్‌ (84) రాణించాడు. మదుశంక 3, షనక 2 వికెట్లు పడగొట్టారు. అయితే, సెమీస్‌ బెర్త్‌ను సొంతం చేసుకోవాలంటే లంకను 147, అంతకంటే తక్కువ పరుగులకే కట్టడి చేయాల్సిన పరిస్థితి.

దుమ్మురేపిన కెప్టెన్‌ షనక

కెప్టెన్‌ షనక (31 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 నాటౌట్‌), పవన్‌ రత్నాయకె (58) అర్ధ శతకాలతో పోరాడడంతో.. ఛేదనలో లంక ఓవర్లన్నీ ఆడి 207/6 స్కోరు మాత్రమే చేయగలిగింది. మిషార (26), అసలంక (25) రాణించారు. విజయానికి చివరి ఓవర్‌లో 28 రన్స్‌ కావాల్సి ఉండగా.. షనక అద్భుత బ్యాటింగ్‌తో పాక్‌కు ముచ్చెమటలు పట్టించాడు. అఫ్రీది వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి నాలుగు బంతుల్లో ఫోర్‌, మూడు సిక్స్‌ లతో 22 పరుగులు రాబట్టాడు. గెలుపునకు 6 రన్స్‌ అవసరమ వగా.. తెలివిగా బంతులేసిన అఫ్రీది.. షనక షాట్లు ఆడకుండా కట్టడి చేశాడు.

అంతకుముందు ఓపెనర్లు ఫర్హాన్‌, ఫఖర్‌ తొలి వికెట్‌కు 176 పరుగుల భాగస్వామ్యంతో అదిరే ఆరంభాన్నిచ్చారు. అయితే, డెత్‌ ఓవర్లలో క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టిన లంక.. కొంతమేర ప్రత్యర్థి జోరుకు బ్రేకులేసింది. 15.4 ఓవర్లలో పాక్‌ 176/0తో భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, ఫఖర్‌ను చమీర ఎప్పుడైతే అవుట్‌ చేశాడో.. అప్పటి నుంచి పాక్‌ బ్యాటింగ్‌ పేకమేడలా కూలింది. 26 బంతుల్లో.. 36 రన్స్‌ తేడాతో 8 వికెట్లు కోల్పోయింది. సెంచరీ పూర్తి చేసుకొన్న ఫర్హాన్‌ను ఆఖరి ఓవర్‌లో మదుశంక అవుట్‌ చేశాడు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments