క్రైమ్ మిర్రర్,అంతర్జాతీయ న్యూస్:- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఎన్నోసార్లు భారతదేశాన్ని పాకిస్తాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఎంతోమంది ఉగ్రవాదులను తయారు చేస్తూ కవింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ నేపద్యంలో మరోసారి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో యుద్ధం గనుక వస్తే భారతీయుల ఇళ్లలోకి చొరబడి మరీ చంపేస్తాము అని అనడం పట్ల భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ అనే పేరిట చేసిన యుద్ధాన్ని బహుశా పాకిస్తాన్ మర్చిపోయి ఉంటుంది అని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికే పచ్చిమాసియా లో యుద్ధం జరుగుతుండగా.. ఈ యుద్ధం పేరిట పాకిస్తాన్ ఎటువంటి చిన్న తప్పు చేసిన కూడా భారత్ ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంది అని ఇప్పటికే మన భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ పాకిస్తాన్ బుద్ధి మాత్రం ఎక్కడా కూడా మారట్లేదు. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ రూపురేఖలు లేకుండా భారత్ చేస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది భారతీయులు పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ది బ్లాక్ లెవెల్ ఆర్టిజెన్సీ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీలో దొంగతనం
క్రమశిక్షణ విషయంలో తగ్గేదే లేదు.. ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం!
