
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలపై భారత కేంద్రం తీవ్రంగా స్పందించింది. అమెరికాలో ఉండి భారత్ పై ప్రేలాపనులు చేయడం సిగ్గుచేటు అని భారత్ తీవ్రంగా మండిపడింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ భారత్ పై అణుదాడి చేస్తామని బెదిరించిన బెదిరింపులకు భయపడేదే లేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించింది. అమెరికా మద్దతు ఇస్తున్నప్పుడల్లా రెచ్చిపోవడం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు అలవాటుగా మారిపోయిందని భారత్ తీవ్రంగా విమర్శించింది.
Read also: నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న రేవంత్ సంగతి తేలుస్తా.. రాజగోపాల్ రెడ్డి వార్నింగ్
ఇక మరోవైపు భారత కుబేరుడు అయినటువంటి అంబానీని కూడా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇండియన్ ఆర్మీ మళ్లీ దాడి చేస్తే గుజరాత్ జామ్ నగర్ లో ఉన్నటువంటి రిలయన్స్ రిఫైనరీని ఫెయిల్ చేస్తామని పాక్ ఆర్మీ చీఫ్ చెప్పినట్లుగా సమాచారం. తాజాగా ఖురాన్ లోని ఒక వాక్యాన్ని ఉదహరిస్తూ… అంబానీ ఫోటో చూపిస్తూ..పాక్ ఆర్మీ చీఫ్ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. కాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ బెదిరించిన వ్యాఖ్యలకు ఇక్కడ ఎవరూ భయపడరని భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం మెల్లిగా మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్ కావాలనే భారత్ ను రెచ్చగొడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ సమయంలో ఇరుదేశాలు ఎలా వ్యవహరిస్తాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏది ఏమైనా కూడా భవిష్యత్తులో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య భారీ యుద్ధమే జరిగే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టిగానే బుద్ధి చెప్పింది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్యయుద్ధమే జరిగితే పక్కాగా అందులో భారత్ ఏ గెలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు.
Read also : వరదల్లో వరంగల్.. ఎడతెరిపి లేకుండా వర్షాలు!