
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడేళ్ల పాటు అధికారంలో ఉన్న కూడా పైసా అభివృద్ధి జరగదని తేల్చి చెప్పారు. ఇక నిన్న విడుదలైనటువంటి మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే కాంగ్రెస్కు కౌంట్ డౌన్ మొదలైందని అర్థమయింది. ఈ పంచాయతీ ఎన్నికల్లో సగం స్థానాలు కూడా గెలవలేకపోయిందని.. కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలకు పూర్తిగా అర్థమయింది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిన్న విడుదలైన ఫలితాలలో చాలా పంచాయితీల్లో 20 నుంచి 50 ఓట్లతోనే చాలా చోట్ల కాంగ్రెస్ గెలుపులు చూసాము అని.. దీన్నిబట్టి చూస్తుంటే కాంగ్రెస్ కౌంట్ డౌన్ గ్రామాల నుంచి మొదలైనట్లుగా స్పష్టంగా అర్థం అవుతుంది అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also : IVFతో 90% జంటలు అప్పులపాలు
ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి.. మరో మూడేళ్లు అధికారంలో ఉన్నా కూడా చేసే అభివృద్ధి ఏమి ఉండదు అని.. నేడు ప్రజలు డిసైడ్ కావడం వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయి అని కేటీఆర్ అన్నారు. ఇక ఈ పంచాయతీ ఎన్నికలు కేవలం ఆరంభమని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పాతాళానికి పడిపోవడం ఖచ్చితమని కేటీఆర్ జోష్యం చెప్పారు. కాగా నిన్న జరిగినటువంటి మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్లో కాంగ్రెస్ 44% విజయాలను నమోదు చేసింది. దాదాపు 2200 కు పైగా స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక టిఆర్ఎస్ 1100 స్థానాలకు పైగా విజయం సాధించింది. ఇక ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా రెండవ విడతలో జరిగేటువంటి పంచాయతీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నాయి.
Read also : Love Trap: యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం, ఆపై మరో ఇద్దరూ..





