
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం మరియు కర్నూల్ లో పర్యటించారు. ప్రధాన మోడీ రాకతో రూపురేఖలు మారిపోయాయని మంత్రి నారా లోకేష్ కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోదీ రూటే సపరేట్ అంటూ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. మన నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కచ్చితంగా విజయవంతంగా పూర్తి అవుతుంది అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ను దడ పుట్టిల చేశారని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద ఎత్తున టారిఫ్ విధించిన కూడా భారత్ ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదని… మన ముందుంది ప్రధాని మోదీ అని.. అలాంటప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరం కూడా రాదు అని ప్రశంసించారు. అవతల దేశాలు మన దేశంపై టారిఫ్స్ విధిస్తుంటే మనదేశంలో మాత్రం జీఎస్టీ తగ్గించి మరో పండుగ వాతావరణ సృష్టించి దసరా మరియు దీపావళి ఒకేసారి జరుపుకునేలా చేశారు అని నారా లోకేష్ అన్నారు. ఒక ప్రధానమంత్రిగా భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మారుస్తున్నారు అని కర్నూల్ లో జరిగినటువంటి సభలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రిగా ఆయన సేవలు కొనియాడాల్సిందే అని స్పష్టం చేశారు. కాగా ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్న ప్రధానమంత్రి అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి నేరుగా శ్రీశైలానికి వెళ్లి అక్కడి నుంచి కర్నూలులో జరిగినటువంటి సభలో పాల్గొన్నారు. ఈ సభ వేదికగా మంత్రి నారా లోకేష్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also : ముందడుగు వేసిన యువత.. బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ ఫిర్యాదు
Read also : మద్దూర్ సంఘం చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతి