
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తమిళనాడులో జరిగినటువంటి బహిరంగ సభలో హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన బహిరంగ సభలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తమిళనాడులో NDA ప్రభుత్వమే అధికారాన్ని చేపడుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా విఫలమైంది అని, మన దేశంలోనే అత్యంత అవినీతి పాలన ఈ తమిళనాడులో ఉంది అని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ప్రస్తుత సీఎం స్టాలిన్ తన కుమారుడిని సీఎం చేయాలనుకుంటున్నారు అని అమిత్ షా కీలక ఆరోపణలు చేశారు. ఇప్పటికే దేశంలో చక్రం తిప్పుతున్న ఎన్ డి ఏ మిగిలిన రాష్ట్రాల్లో కూడా చక్రం తిప్పాలని విస్తృత స్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు. ఇక తమిళనాడులో కూడా NDA చక్రం తిప్పాలని భావిస్తుంది. ఈ తరుణంలోనే తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికలలో అధికారాన్ని చేపట్టే దిశగా కూటమి నాయకులు అడుగులు వేస్తున్నారు. మరి రాబోయే ఎలక్షన్లలో ఏ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : మా జట్టు నూతన దళపతి ఇతడే : రాజస్థాన్ రాయల్స్
Read also : ఫోన్ ట్యాపింగ్: హరీశ్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట..!





