
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన రాజధాని అమరావతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిర్మించే ప్రతి భవనం కూడా చాలా అద్భుతంగా, విలక్షణంగా ఉండాలి అని సూచించారు. అమరావతి కొత్త క్రియేటివ్ గా రూపుదిద్దేలా ఉండాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన రాజధాని అన్నిటిలోనూ ముందుండాలి అని… పచ్చదనంతో ప్రతి ఒక్కరినీ మైమరిపించేలా కనిపించేలా తీర్చిదిద్దాలి అని తాజాగా జరిగినటువంటి CRDA భేటీలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇక అమరావతిలో మౌలిక సదుపాయాల కోసం నా బార్టు ఏకంగా 7380 కోట్ల రుణానికి ఆమోదం కూడా తెలిపింది అని సీఎం తెలిపారు. కాబట్టి రాజధానిలో నిర్మిస్తున్నటువంటి ప్రతి ఒక్క నిర్మాణా నాణ్యతలో రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని కోరారు. గడువు కన్నా ముందే అమరావతి లోని నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి మన రాజధానిని చూస్తే ఆత్మగౌరవం కలగాలని.. మన తెలుగువారి ఆత్మగౌరవానికి అలాగే వైభవానికి ప్రత్యేకగా నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతినే రాజధానిగా చేసి త్వర త్వరగా పనులను పూర్తి చేస్తున్నారు. 20047వ సంవత్సరానికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందేనటువంటి రాష్ట్రంగా పేరు పొందుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎన్నో సందర్భాలలో తెలిపిన విషయం తెలిసిందే.
Read also : పెరికి చెరువును పరిశీలించిన కవిత…!
Read also : అప్పుడు శ్రీకాంత్ చారి బలి….ఇప్పుడు ఈశ్వర్ చారి బలి..!





