
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వేళ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా పంచాయతీ ఎన్నికలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించినటువంటి ఎన్నికల అధికారులకు అలాగే ప్రభుత్వ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ముందు జాగ్రత్తగా మూడు విడతలుగా మొత్తం 12,702 చోట్ల ఎన్నికలు ఉత్కంఠంగా, ఆసక్తికరంగా అలాగే ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. మొత్తం 12,702 చోట్ల ఎన్నికలు జరగగా అందులో 7527 పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు అని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 66% సీట్లు మేమే సంపాదించాము అని.. ఈ ఎన్నికల్లో పూర్తి హవా మాదే కొనసాగింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఈ పంచాయతీ ఎన్నికల్లో సగానికి పైగా మా పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా 3511 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, 710 స్థానాల్లో బిజెపి పార్టీ అభ్యర్థులు గెలిచారు అని స్పష్టం చేశారు. ఇక 146 చోట్ల ఇతరులు గెలిచారు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు 808 స్థానాలను పార్టీ రెబల్స్ గెలుచుకున్నారు అని .. మొత్తంగా ప్రజలందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపారు అని వెల్లడించారు.
Read also : రెండేళ్లకే విసిగిపోయారు.. కెసిఆర్ అధికారంలోకి రావాలని కోరుతున్నారు : కేటీఆర్
Read also : రోడ్డు ప్రమాదాలు జరిగితే సాయం చేయండి.. ₹25000 బహుమతి పొందండి : కేంద్రమంత్రి





