HomeజాతీయంOperation Kagar Success: దేశంలో మావోయిస్టు ఉద్యమం అంతమైనట్లేనా? గడువుకు ముందే ఆపరేషన్‌ కగార్‌ విజయవంతం!

Operation Kagar Success: దేశంలో మావోయిస్టు ఉద్యమం అంతమైనట్లేనా? గడువుకు ముందే ఆపరేషన్‌ కగార్‌ విజయవంతం!

  • దేశ వ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం అంతం
  • గడువుకు ముందే ఆపరేషన్ కగార్ విజయవంతం
  • మార్చి 31లోగా మావోయిస్ట్ ముక్త్ భారత్

దేశంలో మావోయిస్టు ఉద్యమం అంతమైనట్లేనా? కేంద్రప్రభుత్వం విధించిన గడువు కంటే ముందే ఆపరేషన్‌ కగార్‌ విజయవంత మవుతోందా? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. కొన్ని దశాబ్దాలుగా జనతన సర్కార్‌ లాంటి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టు పార్టీ ఇక ఉనికి కోల్పోయినట్లేనని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

మార్చి 31 డెడ్ లైన్ విధించిన కేంద్రం

మావోయిస్టు రహిత దేశం లక్ష్యంగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌కు ఈ ఏడాది మార్చి 31వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. మావోయిస్టు రహిత దేశం లక్ష్యంలో చివరి దశకు చేరుకున్నామని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఈ నెల మొదటి వారంలో రాయ్‌పూర్‌లో కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు, నిఘా విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై అడవుల్లో మిగిలిన మావోయిస్టుల ఏరివేత విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత ఛత్తీసగఢ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒడిశా పోలీసులు మరో సంయుక్త ఆపరేషన్‌ ప్రారంభించి, నిఘా సమాచారాన్ని పంచుకుంటూ కీలక మావోయిస్టు నేత లోకేటి చందర్‌తో పాటు నలుగురిని ఎన్‌కౌంటర్‌ చేశారు. ఆ తర్వాత దేవ్‌జీ లక్ష్యంగా కర్రెగుట్టలపై కేంద్ర బలగాలను మోహరించి ఒత్తిడి పెంచారు.

2019 నుంచి మావోయిస్టు పార్టీని టార్గెట్‌ చేసిన కేంద్రం

వాస్తవానికి 2019 నుంచి మావోయిస్టు పార్టీని టార్గెట్‌ చేసిన కేంద్రం.. పెద్ద ఎత్తున్న సీఆర్‌పీఎఫ్‌ దళాలను మోహరించి ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టింది. సీఆర్‌పీఎఫ్లోని కోబ్రా దళాలు మావోయిస్టుల అడ్డాల్లో బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసుకుని వేట కొనసాగించాయి. మొదటి దశలో 24 బేస్‌క్యాంపులను ఏర్పాటు చేసుకుని మావోయిస్టుల కదలికలకు చెక్‌ పెట్టారు. 2020లో బేస్‌క్యాంపుల సంఖ్యను 40కి పెంచారు. ప్రస్తుతం వ్యూహాత్మక ప్రాంతాల్లో 400 బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసుకోవడం భద్రతా బలగాలు సాధించిన విజయంగా చెప్పవచ్చు. ఒక్కో క్యాంపులో 200-400 మంది సాయుధ పోలీసులు ఉంటారు. వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. నైట్‌ విజన్‌ పరికరాలు, డ్రోన్లు వాడుతూ రాత్రివేళల్లో కూడా మావోయిస్టుల కదలికలను కట్టడి చేశారు. 2019 నాటికి తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ గఢ్‌, బిహార్‌, మహారాష్ట్ర, ఒడిశా సహా పది రాష్ట్రాల్లోని 61 జిల్లాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు జోరుగా సాగుతుండేవి. ప్రస్తుతం వారు పది జిల్లాలకే పరిమితమయ్యారు.

Read Also:  మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ, దేవ్ జీ లొంగుబాటు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు