జాతీయం

తెరుచుకున్న శబరిమల ఆలయం..

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది. సీజనల్ యాత్ర సందర్భంగా ఆలయ దర్శనం ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు పంపా నుంచి స్వామివారి సన్నిధానం వరకు పాదయాత్రకు అనుతిచ్చారు దేవస్థానం బోర్డు. శుక్రవారం నుంచి ప్రతి రోజు దర్శనం కోసం 30వేల మందికి అనుమతిస్తున్నారు. శబరిమల వద్ద గర్భాలయంలోకి సాయంత్రం నుంచి ప్రవేశం కల్పించారు. అయితే దర్శనాలు మాత్రం శనివారం ఉదయం మొదలుకానున్నాయి. అప్పటి నుంచే మండల పూజల సీజన్ అధికారికంగా మొదలవుతుందని చెబుతున్నారు.

ఆన్ లైన్ విధానంలో దర్శనానికి బుకింగ్ ఉంటుంది. ప్రతీ రోజు ఆన్‌లైన్‌లో 70 వేల మంది, స్పాట్ బుకింగ్ ద్వారా 10 వేల మంది మొత్తం 80 వేల మందిని దర్శనాలకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం. అందుకు తగ్గట్టుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శనాల సమయం కూడా పెంచారు. రోజుకు 18 గంటల పాటు దర్శనాలు ఉంటాయని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. పశ్చిమ కనుమల్లో 914 మీటర్ల ఎత్తులో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానానికి పంబ నుంచి 4 కిలోమీటర్ల కాలినడక ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది.

ఇక, 10 ఏళ్లు నిండి.. 50 ఏళ్లలోపు మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధించారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు మండల కాలం అంటే 41 రోజుల పాటు దీక్ష చేపట్టి.. ఇరుమడితో వస్తారు. పవిత్ర 18 మెట్లు మీదుగా స్వామిని దర్శించుకుంటారు. ఇరుముడి ఉన్నవారికే ఈ 18 మెట్లు ఎక్కేందుకు అనుమతి ఉంటుంది. సాధారణ భక్తులు ఈ మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదు. వీరిని పక్కనే ఉన్న గేటు ద్వారా అనుమతిస్తారు.

మండల-మకర విళక్కు పూజల సీజన్ ఏర్పాట్లు, బందోబస్తుపై కేరళ డీజీపీ షేక్ ఉన్నత న్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం 14 వేల మంది పోలీసులతో పాటు వాలంటీర్లను భద్రత విధులు, యాత్రికుల సేవల కోసం మోహరిస్తున్నట్టు తెలిపారు. అలాగే, భక్తుల వాహనాల పార్కింగ్ స్లాట్లను 10 వేలకు పెంచారు. అలాగే, రెస్టారెంట్లు, హోటళ్లపై ధరల వివరాలను దక్షిణాది అన్ని భాషల్లోనూ ఉంచాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

మహారాష్ట్రలో దుమ్ము రేపుతున్న కోమటిరెడ్డి.. ఢిల్లీ పెద్దలు ఖుషీ

పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్.. సంగారెడ్డి జైలుకు కేటీఆర్

చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు

నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!

కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్

కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన

తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button