
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారీ గుడ్ న్యూస్. ఇన్నాళ్లుగా ఎండలతో సతమతమైన ప్రజలు నేటి నుంచి ఉపశమనం పొందవచ్చు. భగభగ మండుతున్న ఎండలు నేటి నుంచి ఉండేటువంటి అవకాశం చాలు తక్కువ. ఎందుకంటే కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రానున్న ఐదు రోజులపాటు భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాబోయే ఐదు రోజులపాటుగా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర మరియు రాయలసీమ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా యానాం ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలలో భారీ వర్షాలతో పాటుగా గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే పరిస్థితి కూడా నెలకొంది అని అధికారులు వెల్లడించడం జరిగింది. ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని imd తెలిపింది. కాబట్టి ఈ భారీ వర్షాలు నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి కాబట్టి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను వాతావరణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు పడుతున్న సమయంలో పొలాలు లేదా చెట్ల కింద ఉండవద్దని.. అలా ఉన్నచో పిడుగులు పడి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాబట్టి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం రోజులు పాటుగా వర్షాలు పడుతూనె ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.