Tuesday, March 10, 2026
Homeజాతీయంఒక యుద్దం....ఎన్నో న‌ష్టాలు

ఒక యుద్దం….ఎన్నో న‌ష్టాలు

  • త‌గ్గిన యూరియా ఉత్ప‌త్తి

  • ఖ‌రీఫ్ సీజ‌న్‌లో రైతులకు క‌ష్టాలు త‌ప్ప‌వా…?

  • ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న వ్య‌వ‌సాయ రంగ నిపుణులు

అదిలాబాద్,క్రైమ్ మిర్ర‌ర్: రాబోయే ఖరీఫ్ సీజన్‌లో రైతులకు యూరియా కొరత తప్పదని, వ్యవసాయ రంగంపై దీని ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఇరానే సైతం ప్రతిదాడులకు దిగుతుండటంతో భీకర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ మిగతా ప్రపంచ దేశాలపై పడుతోంది.

తాజాగా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తిపై యుద్ధం ప్రభావం చూపుతోంది. ఈ కార్మాగారం పూర్తిగా గ్యాస్‌ ఆధారితంగా పనిచేస్తుంది. పశ్చిమాసియా దేశాల నుంచే ఇక్కడకు గ్యాస్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం కర్మాగారానికి గ్యాస్ కొరత ఏర్పడటంతో ఈ నెల 6 నుంచి ఉత్పత్తి సామర్థ్యాన్ని అధికారులు సగానికి తగ్గించారు. సరఫరాలో అంతరాయం ఇలాగే కొనసాగితే యూరియా ఉత్పత్తి మరింత క్షీణించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.రామగుండం కర్మాగారం రోజువారీ యూరియా ఉత్పత్తి లక్ష్యం 3,850 టన్నులు.

అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఉత్పత్తిని సగానికి తగ్గించారు. ఇక్కడి విద్యుదుత్పాదక కేంద్రం కూడాగ్యాస్‌ ఆధారంగానే నడుస్తోంది. దీంతో విద్యుదుత్పత్తి కూడా నిలిచిపోనుంది. ప్రత్యామ్నాయ అత్యవసరాలకు ఎన్‌పీడీసీఎల్‌ విద్యుత్తును వినియోగంలోకి తెచ్చుకునే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గత ఐదు నెలలుగా ఎలాంటి అంతరాయాలు లేకుండా ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో యురియా ఉత్పత్తి కొనసాగుతుండగా.. ప్రస్తుతం నిలిపివేయాల్సిన పరిస్థితులు రానున్నాయనే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా వార్షిక ఉత్పత్తి టార్గెట్ 12.7 లక్షల టన్నులు. ఈ ఏడాది ప్రారంభంలోనే అత్యధిక కాలం ఫ్యాక్టరీ షట్‌డౌన్‌లోనే ఉంది. దీంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు 8.5 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఈనెల 6 వరకు 1,800 టన్నుల యూరియా ఉత్పత్తి నమోదైంది. దేశవ్యాప్తంగా గ్యాస్‌ ఆధారిత ఎరువుల కర్మాగారాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.

యూరియా ఉత్పత్తి తగ్గితే దాని ప్రభావం రైతులపై పడే అవకాశం ఉంది. రైతులు ఖరీఫ్ సీజన్ సాగు కోసం సిద్ధమవుతున్నారు. మరో 3 నెలల్లో సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో యూరియా కొరత ఏర్పడితే సాగు కష్టమవుతుందని.. అన్నదాతలకు కష్టాలు తప్పేలా లేవని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments