
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ లో ఒకప్పుడు చక్రం తిప్పినటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా తమన్న అని చెప్పాలి. ఎందుకంటే తమన్నా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేశారు. అందులో బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే గత కొంతకాలం నుంచి తమన్నా ఐటెం సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక న్యూస్ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అదేంటంటే… తమన్నా ఐటెం సాంగ్స్ కు డాన్స్ చేసి కేవలం ఆరు నిమిషాల్లోనే 6 కోట్ల సంపాదించారన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా జరిగిన నూతన సంవత్సర సెలబ్రేషన్స్ లో భాగంగా గోవాలో జరిగినటువంటి ఒక రెస్టారెంట్లో తమన్నా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇందులో భాగంగానే తమన్నా 6 నిమిషాల పాటు డాన్స్ వేయగా నిమిషానికి కోటి రూపాయలు చొప్పున 6 కోట్లు వసూలు చేశారు అని బాలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలు కోడై కూస్తున్నాయి. ఈ మధ్య తమన్నా జైలర్ మూవీ సినిమాలో “కావాలయ్యా” మరోవైపు స్త్రీ-2 సినిమాలోని “ఆజ్ కి రాత్” ఒంటి సాంగ్స్ కు వేసిన స్టెప్పులతో తమన్న దేశవ్యాప్తంగా బాగా క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతోనే ఆమెకు అన్ని కోట్లు ఇవ్వడానికి కూడా వెనకాడట్లేదు అని సమాచారం. ఏది ఏమైనా కూడా బాహుబలి సినిమాలోని సాంగు తో తమన్నా ఇంకాస్త వైరల్ కాగా ఈ ఐటెం సాంగ్స్ తో మరింత హైలెట్ అయింది. దీంతోనే తమన్నా అడిగినంత ఇవ్వడానికి కూడా ఎవరు అడ్డు చెప్పడం లేదు. మరోవైపు ఫ్యాన్స్ సైతం ఎంత పెద్ద హీరోయిన్ అయినా నిమిషానికి కోటి రూపాయలా?.. అంటూ ఆశ్చర్యపోతూనే క్యా హువా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read also : డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి జాక్ పాట్?
Read also : Guest Privacy: హోటల్ గదిలో దంపతుల గోప్యతకు భంగం, ఏకంగా రూ.10 లక్షల జరిమానా!





