
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్దిరోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరో రెండు మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులకు దసరా సెలవులు ఇవ్వనున్నాయి. కాబట్టి తల్లిదండ్రులే పిల్లలపై ఒక కన్ను వేసి ఉంచాలని.. వారిని కాలువలకు అలాగే చెరువుల దగ్గరకు వెళ్లకుండా చూసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు మరో కీలక సూచనలు జారీ చేశారు. రాయలసీమ లో ఇవాళ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది. మరోవైపు నేడు దాదాపు 11 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని .. తద్వారా ఈ జిల్లాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నేడు వర్షాలు పడే జిల్లాలు..
1. గుంటూరు
2. ప్రకాశం
3. నెల్లూరు
4. పల్నాడు
5. ఎన్టీఆర్
6. కృష్ణ
7. ఏలూరు
8. కోనసీమ
9. అల్లూరి సీతారామరాజు
10. విజయనగరం
11. శ్రీకాకుళం
కాబట్టి ఈ 11 జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు నేడు కురవనున్నాయి. ఈ సందర్భంగా ఈ జిల్లాల్లోని ప్రజలందరూ కూడా ముందుగానే ఏమైనా పనులు ఉంటే వెంటనే పూర్తి చేసుకోవాలని.. వర్షం పడుతున్న సమయంలో ఎవరూ కూడా బయట తిరగవద్దని సూచించారు. మరోవైపు సెప్టెంబర్ 26వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రోజులు వర్షాలు పడే అవకాశాలు స్పష్టంగా తెలుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో దసరా సెలవుల సందర్భంగా పిల్లలందరూ కూడా ఇంటికి వస్తున్నారు. వీళ్ళందర్నీ తల్లిదండ్రులే జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలని… నిర్లక్ష్యం వహిస్తే విద్యుత్ షాకుకు గురయ్యే అవకాశం ఉండడంతోపాటుగా.. మరిన్ని ప్రమాదాలు ముంచి ఉన్నాయని అధికారులు సూచనలు జారీ చేశారు.
Read also : జాతికి అంకితం అన్నారు.. ప్రాజెక్టును గందరగోళం చేశారు : చంద్రబాబు
Read also : ఎమ్మెల్సీలకు గవర్నర్ బ్రేక్? – రాజ్‌భవన్‌లో కదలని గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైల్