
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ ఎవరు ఊహించినటువంటి ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలలో నామినేషన్ వేసినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) నిన్న అర్ధరాత్రి సమయంలో గుండెపోటు కారణంగా మరణించారు అని అతని కుటుంబ సభ్యులు సమాచారాన్ని అందించారు. ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్నా సంకల్పంతో ఎర్రగడ్డలో నివాసం ఉండేటువంటి ఈ మహమ్మద్ అన్వర్ అక్టోబర్ 22వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా నామినేషన్ వేశారు. ఆ తరువాత ఎన్నికల అధికారులందరూ కూడా అతనిని, అతని పూర్తి సమాచారాన్ని తెలుసుకొని నామినేషన్ ను యాక్సెప్ట్ చేసి పోటీలలో నిలిచేందుకు ఓకే చెప్పారు. అయితే నేడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఫలితాలు వెల్లడవుతున్న ఒకరోజు ముందు మహమ్మద్ అన్వర్ గుండెపోటు కారణంగా మరణించడం అనేది ఆయన కుటుంబ సభ్యులతో పాటు అతని అనుచరులు కూడా పూర్తిగా విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం నామినేషన్ వేసినటువంటి అభ్యర్థి మృతి చెందడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర ఘటనగా ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు.
Read also : ఐపీఎల్ టీమ్స్ లలో భారీగా ప్లేయర్ల మార్పులు?
Read also : ఉగ్రకుట్రకు అడ్డగా అల్ ఫలాహ్ వర్సిటీ, స్థాపకుడి అక్రమాలపై ఈడీ నజర్!





