
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి మెల్లిగా మొదలవుతుంది. నిన్న మొన్నటి వరకు భారీ ఎండలతో ప్రజలు సతమతమవుతూ ఉండగా.. ఇక మెల్లిగా చలితో ఇబ్బందులు పడడానికి సిద్ధంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా నిన్న మొన్నటి వరకు భారీ వర్షాలు దంచి కొట్టగా.. ఇక మెల్లిగా వర్షాలు కూడా తగ్గిపోయాయి. ఇటువంటి నేపథ్యంలోనే రాత్రి వేళల్లో చలి విపరీతంగా పెరుగుతుంది అని… తాజాగా IMD కీలక ప్రకటన చేసింది. మన భారతదేశ వ్యాప్తంగా వచ్చే వారం రోజులలో దాదాపు సాధారణ ఉష్ణోగ్రత కంటే 2-5°C డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇక రాబోయే 48 గంటల్లో 2-3°C, ఈస్ట్ ఇండియాలో వచ్చే మూడు రోజుల్లో 3-4°C ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోవచ్చు అని వెల్లడించారు. ఈ సమయంలో ప్రజలు కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అని.. అధికారులు చెప్పిన మేరకు నడుచుకోవాలి అని సూచించారు. చలికాలంలో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండడంతో.. ఆరోగ్యం పట్లతో జాగ్రత్తలు వహించాలని సూచించారు. మరీ ముఖ్యంగా ఉదయం ఏడు గంటలకు ముందు అలాగే రాత్రి 7 గంటల తర్వాత ఎవరూ కూడా బయట అడుగు పెట్టకండి అని… ఇప్పటినుండే చలి పట్ల జాగ్రత్తలు వహించాలి అని సూచించారు. మరి మీ ప్రాంతంలో ఏ విధంగా చలి వీస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి
Read also : ఆదేశాలను వెంటనే అమలు చేయాలి.. లేదంటే చర్యలు తీసుకుంటాం!
Read also : నేడే చివరి టీ20.. జట్టులో కీలక మార్పులకు అవకాశం?





