
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- సౌత్ ఆఫ్రికా జట్టు ఎక్కడ అడుగుపెట్టిన కూడా దురదృష్టమే వెంటాడుతుంది. ఎందుకంటే ఈ జట్టు ఇప్పటివరకు ఎన్నో వరల్డ్ కప్ మ్యాచెస్ లో ఫైనల్ కి చేరడం ఆ తరువాత ఓడిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా బాగోద్వేగానికి గురవుతున్నారు. గత సంవత్సరంలో జరిగినటువంటి టి20 వరల్డ్ కప్పులో ఫైనల్స్ కు వచ్చినటువంటి సౌతాఫ్రికా పురుషుల జట్టు మన భారత జట్టు చేతులో ఓటమి పాలయ్యింది. మళ్లీ నిన్న ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్పులో కూడా ఫైనల్స్ కు రావడం అక్కడ మన భారత జట్టు చేతులోనే ఓడిపోవడం.. ఇలా అన్నీ విధాలుగా సౌతాఫ్రికా జట్టుకు పూర్తిగా నిరాశ ఎదురవుతుంది. ఈ మ్యాచెస్ చూస్తున్నటువంటి దేశ విదేశాల ప్రేక్షకులు కూడా పాపం దక్షిణాఫ్రికా అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వైట్ బాల్ క్రికెట్ లో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతుందని చెప్పాలి. వరల్డ్ కప్ గెలవాలని కలలు కన్న మహిళలు జట్టు కూడా అడుగు దూరంలోనే ఆగిపోవడంతో.. నిన్న మ్యాచ్ ఓడిపోయిన అనంతరం సౌత్ ఆఫ్రికా జట్టు మహిళలు పూర్తిగా ఆవేదనకు గురవడం చూస్తూనే ఉన్నాము. కొంతమంది ప్లేయర్స్ అయితే ఏకంగా కన్నీరే పెట్టారు. ఫైనల్ మ్యాచ్లలో వరల్డ్ కప్పును అందుకోవడం ఆ జట్టుకు అందని ద్రాక్షగాని మిగిలిపోయింది. ఒకవైపు విజయంతో అందరి ముఖాల్లో సంతోషాలు ఉంటే సౌత్ ఆఫ్రికా పురుషులు మరియు మహిళల జట్టు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఇదిలా ఉండగా సౌత్ ఆఫ్రికా జట్టుకు ఫ్యాన్స్ అందరూ కూడా ఏదో ఒక రోజు విజయం సాధిస్తారు అని సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు.
Read also : టీమిండియా పై ప్రశంశల వెల్లువ..!
Read also : జగన్ కు ప్రతిదీ రాజకీయమే.. మరోసారి రుజువు చేశారు : టీడీపీ





