Wednesday, March 25, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఎమ్మెల్యే ఇంటి ఎదుట క్షుద్రపూజల కలకలం

ఎమ్మెల్యే ఇంటి ఎదుట క్షుద్రపూజల కలకలం

  • శింగనమల ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ఎదుట దుశ్చర్య
  • నిమ్మకాయలు, పువ్వులు చల్లి వెళ్లిన దుండగులు
  • కారులో వచ్చి పరారైన దుండగులు, వెంబడించిన ఎమ్మెల్యే అనుచరులు
  • ప్రత్యర్థుల పనేనని ఎమ్మెల్యే శ్రావణి అనుమానం
  • రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు పన్నారని ఆరోపణ

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ఎదుట క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. శ్రావణి ఇంటి ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు, పువ్వులు చల్లి వెళ్లారు. ఓ కారులో వచ్చి పడేసి వెళ్తుండగా… ఎమ్మెల్యే అనుచరులు వారిని వెంబడించారు. కానీ, దుండగులు వారికి దొరకకుండా పారిపోయారు. గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇది తన ప్రత్యర్థుల పనేనని ఎమ్మెల్యే శ్రావణి అనుమానిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఘటనపై ఎమ్మెల్యే శ్రావణి అనుచరులు అనంతపురం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments