
– అలుగు పోస్తున్న చెరువులు, నిండిన కుంటలు
– చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి
– వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్: చౌటుప్పల్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలోని పలు గ్రామాల చెరువులను ఆర్డీవో శేఖర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి లు శుక్రవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శేఖర్ రెడ్డి మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని దండు మల్కాపురం, ఖైతాపురం, దేవలమ్మ నాగారం, చెరువులు అలుగు పోస్తుండడంతో తంగడపల్లి, లక్కారం చెరువు లకు సగం పైన నీళ్లు వచ్చాయని తెలిపారు. వర్షం ఇలానే ఎడతెరిపి లేకుండా కురిస్తే అలుగు పోసే అవకాశం ఉందని అన్నారు. చెరువుల్లో నీళ్లు రావడం సంతోషంగా ఉందని ఈ ప్రాంత రైతులకు సాగునీరు, త్రాగునీటికి రెండు సంవత్సరాలు వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, స్థానిక మాజీ కౌన్సిలర్ కొయ్యడ సైదులు గౌడ్, గుండెబోయిన ఐలయ్య యాదవ్, గుండెబోయిన రాజు యాదవ్, శ్రీమన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read also : ముందస్తు చర్యలు లేకపోవడం కారణంగానే నేడు ఈ దుస్థితి : హరీష్ రావు
Read also : వరద బాధితులకు జనసేన నాయకులు అండగా నిలబడండి : పవన్ కళ్యాణ్