
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టీమిండియా మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించారు. తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. రోహిత్ శర్మ తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాత స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత కెరీర్లో తొలిసారి ఫస్ట్ ర్యాంకు సాధించిన రోహిత్ శర్మ ప్రస్తుతం అదే స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక సౌత్ ఆఫ్రికా తో జరిగినటువంటి 3 వన్డే మ్యాచ్లలో భాగంగా విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు చేయడంతో ఏకంగా వన్డే ర్యాంకింగ్స్ లో రెండవ స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ 2 లో మనోళ్లే నిలిచారు. దీంతో మైదానంలోనే కాదు.. ర్యాంకింగ్స్ లోను వీరిద్దరూ స్నేహితుల్లా, రెండు కళ్ళలా ఉంటున్నారని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read also : పాకిస్తాన్ అమ్మాయిల గుండెల్లో అభిషేక్ శర్మ.. గూగుల్లో తెగ వెతికేస్తున్నారంట?
ఇక మరోవైపు టి20 ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో అభిషేక్ శర్మ నిలిచాడు. ఇక ఆల్రౌండర్ల స్థానంలో హార్దిక్ పాండ్యా ఏకంగా నాలుగో స్థానానికి చేరుకున్నారు. దీంతో టెస్ట్, వన్డే మరియు టి20 ర్యాంకింగ్స్ లో మన భారత జట్టు ఆటగాళ్ల హవాని కొనసాగిస్తున్నారు. సిక్సర్లలో రోహిత్ శర్మ, అత్యధిక పరుగులలో విరాట్ కోహ్లీ, అత్యధిక బౌలింగ్ యావరేజ్ తో బుమ్రా, ఈ మధ్యకాలంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా హర్షదీప్ సింగ్ రికార్డులు సృష్టిస్తున్నారు. మరోవైపు మహిళలు కూడా తాజాగా జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి వరల్డ్ కప్పును ముద్దాడారు.
Read also : అఖండ-2 ఎఫెక్ట్.. పలు సినిమాలకు భారీ ఎదురుదెబ్బ!





