
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఐ బొమ్మ రవి ఎన్నో సినిమాలను పైరసీ చేసిన సందర్భంలో అతనిని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్న సమయంలో నిర్మాత శ్రీ కళ్యాణ్ ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని సంచలన కామెంట్స్ చేశారు. పోలీసులు వల్ల చేతకాకపోతే సినిమా వాళ్ళైనా చేయాలి అంటూ ఫిలిం ఛాంబర్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో అతను వ్యాఖ్యానించారు. ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేస్తేనే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉంటాయి అని అతను అన్నారు. కడుపు మంటతో రగిలిపోతూ.. ఎంతో బాధ ఉంటే కానీ ఈ కామెంట్స్ చేయను అని అన్నారు.
Read also : వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఫేక్ వ్యక్తులు చెప్పే ఫేక్ మాటల్ని నమ్మకండి : TDP
అయితే అతను మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోగా తాజాగా బొమ్మ రవి తండ్రి తన కొడుకుని ఎన్కౌంటర్ చేయాలన్న నిర్మాత విషయంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని నిర్మాత శ్రీ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను రవి తండ్రి అప్పారావు తప్పు పట్టారు. సినిమాలలో విషయం ఉంటే కచ్చితంగా జనాలు థియేటర్లకు వచ్చి చూస్తారు అని అన్నారు. నేను 45 పైసలు తోనే సినిమా చూసేవాడిని. ఇవాళ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. కోట్లు ఖర్చుపెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు అని ఐ బొమ్మ రవి తండ్రి అప్పారావు తిరిగి మళ్లీ సినిమా ఇండస్ట్రీని ప్రశ్నించారు. మీరు అన్యాయంగా డబ్బు దోచుకుంటున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అని అన్నారు. నా కొడుకును ఎన్కౌంటర్ చేస్తారా?.. ముందు కళ్యాణ్ ని ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది అని అతను సమాధానంగా ఎద్దేవా చేశారు. నా కొడుకు తరపున వాదించే ప్రతి న్యాయవాదికి ఆర్థిక సహాయం చేస్తాను అని అతను తెలిపారు.
Read also : IND vs SA మ్యాచ్.. ఆంధ్రాలో అడుగుపెట్టనున్న రోహిత్, కోహ్లీ





