
Kangana Ranaut: ఎంపీ, బాలీవుడ్ నటి కంగానా రనౌత్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పుడిప్పుడే పాలిటిక్స్ ను అర్థం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే, అనుకున్న స్థాయిలో రాజకీయాలను ఆస్వాదించలేకపోతున్నట్లు వెల్లడించారు. రాజకీయ రంగం అనేది ఎంతో పనితనంతో కూడినదన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కష్టపడాల్సి వస్తుందన్నారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడిన కంగనా రౌనౌత్.. ప్రజలు చిన్న చిన్న సమస్యలకు కూడా తన దగ్గరికి వస్తున్నారని చెప్పారు. మురికి మోరీలు బాగు చేయించాలని తనను కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఎంపీని అనే విషయం మర్చిపోయి.. ప్రజలు పంచాయితీ స్థాయి సమస్యలను పట్టుకుని తన దగ్గరకు వస్తున్నారని వెల్లడించారు. మరికొంత మంది రోడ్డు సరిగా లేవని.. గుంతలు పడ్డాయని చెప్తున్నారు. ఎమ్మెల్యే స్థాయి పనులు కూడా తన దగ్గరికి తీసుకొస్తున్నారని వెల్లడించారు. మరికొంత మంది అయితే, మీ దగ్గర డబ్బుంది కదా, చేయొచ్చు కదా? అంటున్నారని చెప్పుకొచ్చారు.
నిజానికి ప్రజలకు ఏ సమస్యలను ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలో తెలియడం లేదన్నారు కంగనా. అయితే, కేంద్ర ప్రభుత్వం పరిధిలో జరిగే పనులను తాను టేకప్ చేస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాలు అనేవి సమస్య ఏదైనా పరిష్కరించాల్సిన బాధ్యత నాయకులదే అనే ఆలోచన ప్రజల్లో ఉందని, దానికి అనుగుణంగా నడుచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే ప్రజలు తన దగ్గరికి తీసుకొచ్చే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు కంగనా వెల్లడించారు.
Read Also: రాజకీయాలకు స్వస్తి, అమిత్ షా ప్లాన్ ఇదే!