
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈ దేశంలో కుక్కలను దారుణంగా చంపేస్తున్నారు అని నటి రేణు దేశాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ కుక్కలు కనపడిన వాటిని చాలామంది చంపడానికి చూస్తున్నారే కానీ… కుక్కలన్నీ ప్రమాదకరం కాదని మీకు తెలియదా?.. అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒకచోట ఒకటి లేదా రెండు కుక్కలు హాని చేస్తున్నాయి అని కొన్ని వందల కుక్కలను చంపేయడం ఏంటి?.. అని ప్రశ్నించారు. బయట వేల సంఖ్యలో కుక్కలను చంపేస్తున్నారు. అసలు మీకు నిద్ర ఎలా పడుతుంది?.. అని ప్రశ్నించారు. ఎవరైనా సరే కర్మను అనుభవించాల్సిందే అని… కాబట్టి దయచేసి ఏ విషయం పైన అయినా సరే ఆలోచన పెట్టండి అని కోరారు.
ఇకనుంచైనా హాని కలిగించే కుక్కల గురించి మాకు సమాచారం అందజేస్తే వాటిని తప్పకుండా మేము తీసుకువెళ్తాం అని స్పష్టత ఇచ్చారు. మరోవైపు డెంగీతో పిల్లలు చనిపోయిన, అత్యాచారాలు జరిగిన లేదా హత్యలు జరుగుతున్న ఎందుకు ప్రశ్నించడం లేదు అని ప్రశ్నించారు. మనుషులు కనపడరు కానీ మీకు కుక్కలు కనిపిస్తాయా?… మనుషులు కూడా కాస్త మారాలి అని మండిపడ్డారు. కాగా సుప్రీంకోర్టు సైతం కుక్కల విషయంపై సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.





