
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ అలాగే బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ వాగ్వాదం పై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారని సమాచారం అందింది. అసెంబ్లీలో కూటమి పార్టీల ఎమ్మెల్యేల తీరుపై నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పార్టీ లైన్ దాటుతున్నారని… వ్యక్తిగత అజెండాలు పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీని గొడవలకు వేదికగా చేసుకోవడం మంచిది కాదని సీఎం సూచించారు. సుధీర్ రెడ్డి, బూర్ల ఆంజనేయులు, బొండా ఉమాతో పాటుగా కొంతమంది నాయకులకు సీఎం క్లాస్ ఇచ్చినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది.
Read also : ట్రంప్ వల్లే యుద్ధం ఆగిపోయింది.. శాంతికి మారుపేరు ట్రంప్ : పాకిస్తాన్ ప్రధాని
అయితే అసెంబ్లీ వేదికగా బీజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావాలనే చిరంజీవిని ఇతర హీరోలను తాడేపల్లికి పిలిచి తీవ్రంగా అవమానించారని… జగన్ రాకుండా మంత్రిని పంపారని.. చిరంజీవి ఫోన్ చేసి గట్టిగా అడిగితేనే జగన్మోహన్ రెడ్డి వచ్చారని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. జగన్ కి ఫోన్ చేసి ఎవరు గట్టిగా అడగలేదు… హీరోలను అవమానించిన విషయం కరెక్టే… కానీ జగన్ ను ఎవడు గట్టిగా అడగలేదని.. జగన్ సైకో గాడని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా FDC లిస్టులో నా పేరు ను తొమ్మిదవ స్థానంలో ఉంచడంపై బాలయ్య తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని కారణంగానే బాలకృష్ణ మరియు కొంతమంది ఎమ్మెల్యేల మధ్య గొడవ అయినట్లుగా తెలుస్తుంది. దీనిపై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరు హద్దులు దాటి మాట్లాడొద్దని.. కామినేని, బాలకృష్ణ తో పాటుగా కొంతమందిని హెచ్చరించినట్లుగా తెలుస్తుంది.
Read also : తెలంగాణకు వాయుగుండం ఎఫెక్ట్.. నేడు విపరీతమైన వర్షాలు!