
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:-
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజనులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాజాగా అమెరికాలో ప్రజలందరూ కూడా ట్రంప్ పాలసీలు అలాగే నియంతృత్వాన్ని ప్రశ్నిస్తూ “NO KINGS ” అంటూ ప్ల కార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని లక్షల మంది ప్రజలు వీధుల్లోకి ఎక్కి ట్రంప్ పై వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో పలు ముఖ్య నగరాలు అయినటువంటి వాషింగ్టన్, చికాగో, న్యూయార్క్ వంటి నగరాలలో పెద్ద ఎత్తున జనం రోడ్డు మీదకు వచ్చి నిరసనల గళం వినిపించారు. ఇమిగ్రేషన్, ఎడ్యుకేషన్, సెక్యూరిటీ పాలసీలపై తీవ్రంగా మండిపడుతున్నారు. పలు దేశాల మధ్య యుద్ధాలు ఆపాను అని.. నా వల్లే ఇతర దేశాల్లో శాంతి నెలకొంది అని గొప్పలు చెప్పుకోవడం కాదు. మొదట మీ ప్రజలకు మంచి పాలన అందించి, దేశాన్ని బాగు చేసుకో అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఇతర దేశాలపై టారిఫ్ విధించడంలో ఉన్న దృష్టి.. దేశ పాలసీలపై ఎందుకు లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అసలు దేశంలో ట్రంప్ ను ఎందుకు ఎన్నుకున్నారు అని మరి కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. కాగా నోబెల్ శాంతి అవార్డు దక్కకపోవడంతో ట్రంప్ తీవ్ర నిరాశలో ఉన్న విషయం అందరికి తెలిసిందే.
Read also : బీసీ బంద్… హింసాత్మక ఘటనలకు పాల్పడిన 8 మంది అరెస్ట్!
Read also : జోగిపేటలో హృదయ విదారక దృశ్యం… కొడుకు మృతదేహంతో తల్లి ఆందోళన