
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పై కొన్ని అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో శ్యామల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చాలా చేర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “యూరియా, డయేరియా, కలరా.. వీటి వల్ల ప్రజలు ఏమైనా పర్వాలేదు.. మనల్ని ఆపేది ఎవడురా.. వెళ్లి వేయి రూపాయలు పెట్టి టికెట్ కొనరా!” అంటూనే ‘PPP’ అని రాసుకొచ్చారు. ఇంతటితో ఆగకుండా ‘ఫెయిల్డ్ కూటమి’ అని హ్యాష్ ట్యాగ్ కూడా జోడించారు.
Read also : వరల్డ్ నెంబర్ వన్ సైకో అంటూ అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు?
ఈమధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరుగుతుంది. ఇటువంటి తరుణంలో మళ్లీ శ్యామల పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకవైపు కూటమి తాము చేసిన అభివృద్ధి పనుల గురించి సూపర్ సిక్స్ – సూపర్ హిట్ అంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారు. మరోవైపు వైసీపీ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు మెడికల్ కాలేజీలపై నిరసనలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలానే విషయాలు రాజకీయ చర్చకు వస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు అలాగే ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య చాలానే రాజకీయ విభేదాలు ఉన్నట్లుగా అర్థమవుతుంది. దీంతో నాయకులందరూ కూడా నువ్వా- నేనా అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
విధి కూడా పాకిస్తాన్ ను అవమానిస్తోందా?.. సండే ఇరుదేశాల మధ్య ఫైనల్ పోరు