Homeజాతీయంలోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?

  • అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో విపక్షాలు

  • ఇప్పటికే 100మందికి పైగా ఎంపీలతో సంతకాల సేకరణ

  • లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేసే అవకాశం

  • ఫిబ్రవరి 13తో ముగియనున్న తొలి విడత బడ్జెట్‌ సమావేశాలు

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే 100మందికి పైగా ఎంపీలతో సంతకాలు సేకరించినట్టు తెలుస్తోంది. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఇవాళ నోటీసులు ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. సుమారు 100మంది సంతకాలతో 14రోజుల ముందు అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని నిబంధనల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈనెల 13తో తొలి విడత బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి. రెండో విడత సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై రగడ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో స్పీకర్‌ ఓం బిర్లా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి… అధికార పక్షానికి కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని విపక్షాలు నిర్ణయించాయి.

Most Popular

Recent Comments