తెలంగాణ

ప్రభుత్వ పాఠశాల ముగ్గుల పోటీలో సర్పంచ్ కూతురు ప్రతిభ.

  • విద్యార్థుల సృజనాత్మక ప్రతిభకు వేడుకగా ముగ్గుల పోటీలు.
  • ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తా సర్పంచ్ తుడుం శ్రావణి రాకేష్.
  • సర్పంచ్ కూతురు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం పట్ల గ్రామస్తుల హర్షం.

క్రైమ్ మిర్రర్, పెద్దవూర ప్రతినిధి: పెద్దవూర మండలం బసిరెడ్డిపల్లి ఎంపీపీఎస్ పాఠశాల నందు విద్యార్థులలో దాగి ఉన్న కళాత్మకతను వెలికితీయాలనే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు సర్పంచ్ తుడుం శ్రావణి రాకేష్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించబడినవి.

 

ఈసందర్బంగా ముగ్గుల పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి హారిక,జ్ఞానశ్రీ,ద్వితీయ బహుమతి యజ్ఞశ్రీ కి బహుమతులు అందజేశారు.

 

ఈసందర్బంగా సర్పంచ్ తుడుం శ్రావణి తుడుం రాకేష్ మాట్లాడుతూ తన కూతురు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ మొదటి బహుమతి సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటుగా పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు.

 

విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ కళలకు ప్రాధాన్యం కల్పించిన ఈ కార్యక్రమం కావడంతో గ్రామస్తుల హృదయాలను ఆకట్టుకుంది.

ఈకార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రావుల విజయ రావుల రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గాప్రసాద్ మరియు ఉపాధ్యాయులు సైదులు
అంగన్వాడీ ఉపాద్యాయు రాలు,ఆయా
పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button