అంతర్జాతీయం

నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు, యెమెన్ సర్కారు కీలక నిర్ణయం!

Nimisha Priya Case: యెమన్ లో ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. ఆమె ఉరిశిక్షను యెమన్ సర్కారు రద్దు చేసినట్లు కాంతాపురం భారత గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబూబకర్ కార్యాలయం వెల్లడించింది.  ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. “నిమిష ప్రియ ఉరి శిక్షను రద్దు చేశారు. సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తాత్కాలికంగా సస్పెండ్ చేసిన ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేయాలని యెమన్ సర్కారు నిర్ణయించింది” అని ప్రకటించింది.

నిమిష ప్రియ విడుదల అవుతుందా?

నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు విషయాన్ని యెమెన్‌ లోని యాక్షన్‌ కౌన్సిల్‌ ఫర్‌ తలాల్‌ మహదీస్‌ జస్టిస్‌ ప్రతినిధి సర్హాన్‌ షంశాన్‌ అల్‌ విశ్వాబి కూడా ధృవీకరించారు. అయితే, భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరణశిక్ష రద్దు తర్వాత నిమిష ప్రియ విడుదలవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఉరిశిక్ష రద్దు అయినా, ఆమెకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. లేదంటే బ్లడ్ మనీ ఇచ్చి విడుదల చేయించుకోవాల్సి ఉంటుంది.  మృతుడు తలాల్‌ మహదీ కుటుంబ సభ్యులతో నిమిష కుటుంబం ప్రస్తుతం చర్చలు కొనసాగిస్తూనే ఉన్నది. తొలుత నిమిషకు ఉరిశిక్ష పడాల్సిందే అని మహదీ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పినప్పటికీ, ఆ తర్వాత ముస్లీం పెద్దలు రంగంలోకి దిగడంతో కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఒకవేళ చర్చలు ఫలించి బ్లడ్ మనీ తీసుకుంటే, ఆమె విడుదల అయ్యే అవకాశం ఉంది.

Read Also: ట్రంప్ కాల్ చేయలేదు, పాకిస్తానే కాళ్ల బేరానికి వచ్చింది!

Back to top button