క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఈ ఏడాది ముగియబోతోంది. ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ డిసెంబర్ 31న పార్టీతో ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక డిసెంబర్ 31న మద్యం ప్రియులకు పండగే.. పండగ. మందు పార్టీ చేసుకునేందుకు ముందుగానే ప్రిపెర్ అవుతుంటారు. కొందరైతే 31 కోసం ముందస్తుగానే మద్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. మద్యం షాపులకు ఫుల్లు గిరాకీ. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న వైన్స్ షాపులు సమయ వేళలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే బార్‌లు, రెస్టారెంట్‌లు కూడా తెల్లవారుజామున 1:00 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
Read Also : కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. ఎమ్మెల్సీ కవిత
ఈ మార్పులను ధృవీకరిస్తూ ఎక్సైజ్ శాఖ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రభుత్వం వివిధ ప్రత్యేక కార్యక్రమాలను గ్రీన్‌లైట్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కొన్ని షరతులకు లోబడి తన అధికార పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసింది. పార్టీలు, పబ్‌లలో డ్రగ్స్ వాడకుండా చూడాలని ఈవెంట్ నిర్వాహకులను ఆదేశించారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని నిరోధించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, వైన్ షాపులను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడానికి అనుమతించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ సూచన
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్ రెగ్యలర్ బెయిల్ పిటీషన్ పై తీర్పు వాయిదా
- పదవులకే వన్నే తెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్.. సీఎం రేవంత్ రెడ్డి
- చరణ్ సినిమా ఈవెంట్ కు డిప్యూటీ CM ను ఆహ్వానించిన దిల్ రాజ్!..
- తెలంగాణ పోలీస్ కొత్త లోగో.. విడుదల చేసిన తెలంగాణ పోలీసులు