Homeతెలంగాణగులాబీ పార్టీలో కొత్త గుబులు...!

గులాబీ పార్టీలో కొత్త గుబులు…!

జీవన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్న ఉమ్మడి కరీంనగర్ నేతలు

అందలం ఎక్కిస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరిక

బిఆర్ఎస్ ను వీడేందుకు చాలామంది నాయకులు రెడీ?!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: గులాబీ పార్టీలో జీవన్ రెడ్డి చేరికను కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారా? దశాబ్దాలుగా జీవన్ రెడ్డి పై పోరాడిన చాలామంది నేతలు పునరాలోచనలో పడ్డారా? పార్టీలోకి తెచ్చి సెక్రటరీ జనరల్ హోదా కల్పిస్తే ఊరుకునేది లేదని కెసిఆర్ ను హెచ్చరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జీవన్ రెడ్డిని చేర్చుకున్న మరుక్షణం చాలామంది నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

లోకల్ నాయకుల నుంచి వ్యతిరేకత
నాలుగు దశాబ్దాల బంధాన్ని తెంచుకున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గులాబీ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాజకీయంగా బిఆర్ఎస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వరుస ఎదురైన ఓటములతో భారీ సంక్షోభంలో ఉంది. అయితే దాని నుంచి గట్టెక్కేందుకు భారీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగా జీవన్ రెడ్డిని పార్టీలోకి రప్పించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరుగులేని ఇమేజ్ ఉన్న సీనియర్ నేత కావడంతో జీవన్ రెడ్డిని చేర్చుకునేందుకు ఆరాటపడుతోంది గులాబీ పార్టీ. దీంతో రాష్ట్రస్థాయిలో మంచి సంకేతాలు ఇవ్వాలని చూస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి చేరికను చాలామంది లోకల్ నాయకులు వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.

జీవన్ రెడ్డితో ఇబ్బందులు..
ఒక్క జగిత్యాల కాదు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలను శాసించారు జీవన్ రెడ్డి. గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీపై అలుపెరగని పోరాటం చేశారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి వల్ల గులాబీ పార్టీ క్యాడర్ ఇబ్బంది పడింది. అటువంటి జీవన్ రెడ్డిని తెచ్చి పార్టీలో కీలక పదవి ఇస్తే జై కొట్టేందుకు ఇష్టపడడం లేదు బిఆర్ఎస్ కేడర్ కు. ఎల్.రమణ లాంటి నేతలు ఇప్పటికే ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. జీవన్ రెడ్డిని పార్టీలోకి తేవడమే కాదు.. సెక్రెటరీ జనరల్ హోదా కట్టబెడితే.. ఇన్ని రోజులు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన నాయకులు మనస్థాపానికి గురవడం ఖాయమని తెలుస్తోంది. జీవన్ రెడ్డిని చేర్చుకున్న క్షణం చాలామంది నేతలు బయటకు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది.

వారి పరిస్థితి ఏంటి
కచ్చితంగా జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో మంచి పదవిని కోరుకుంటారు. కెసిఆర్ సైతం మంచి గుర్తింపు ఇస్తారు. కానీ ఇప్పటికే జిల్లాలో గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వంటి సీనియర్ నేతలు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. జీవన్ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తే ఈ ఇద్దరు నేతలు కు తప్పకుండా తగ్గుతుంది ప్రయారిటీ. వారి అనుచరుల్లో కూడా ఇదే ఆందోళన వ్యక్తం అవుతోంది. జీవన్ రెడ్డి పార్టీలోకి వస్తే పాత బిఆర్ఎస్ క్యాడర్లో మాత్రం చిలుక వచ్చే అవకాశం ఉంది. అందలం ఎక్కించేవారు అపరిచితులు అయితే.. అండగా ఉన్నవారు అన్యాయం అయిపోతారా అనే చర్చ కరీంనగర్ లోకల్ వాట్సాప్ గ్రూపులో హల్చల్ చేస్తోంది.

ఆహ్వానించ తగ్గదే అయినా..
ప్రస్తుతం బీఆర్ఎస్ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. జీవన్ రెడ్డి లాంటి మేధావి, సీనియర్ నేత పార్టీలోకి వస్తే మేధోపరమైన బలం చేకూరుతుంది. ఒక బలమైన కాంగ్రెస్ నేత.. దశాబ్దాలుగా అనుబంధం తెంచుకొని గులాబీ పార్టీలోకి వస్తున్నారు అంటే ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఎప్పటినుంచో పని చేస్తున్న క్యాడర్ అసంతృప్తికి గురి కావడం సహజం. దీనిని బిఆర్ఎస్ నాయకత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు